Journalists | శిక్షణ‌ను సద్వినియోగం చేసుకోవాలి

Journalists | శిక్షణ‌ను సద్వినియోగం చేసుకోవాలి

Journalists | చిట్యాల, ఆంధ్రప్రభ : ఈనెల 23, 24వ తేదీల్లో హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులను జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టి యు డబ్ల్యూజె ( ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. శిక్షణ తరగతులను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన అనంతరం చిట్యాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సంబంధించి ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 17వ తేదీలోగా టీయుడబ్ల్యూజె జిల్లా కమిటీకి తమ పేర్లను అందజేయాలని తెలిపారు. జర్నలిజంలో వృత్తిపరంగా ఎంతో నైపుణ్యం కోసం అందజేస్తున్న ఈ శిక్షణ జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, వృత్తిపరంగా మెలకువలు నేర్పించడం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పులిమామిడి మహేందర్ రెడ్డి, దోటి శ్రీనివాస్,యే ళ్ల బయన్న, మెండె వెంకన్న, పోకల కరుణాకర్, చెరుపల్లి శ్రీనివాస్, మిరియాల ప్రకాష్, అమ రోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply