నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 26:(ఆంధ్రప్రభ) : ఎట్టకేలకు ఆస్తిపన్ను వడ్డీ మాఫీపై రాయితీ కల్పించారు. ప్రజలకు ఉపయోగకరమైన అంశమైన ఆస్తి పన్ను వడ్డీ మాఫీఫై రాయితీ కల్పించాలని అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. వడ్డీ రాయితీ మాఫీ కల్పిస్తే పన్ను వసూళ్లు పెరగడమే కాకుండా కార్పొరేషన్ ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో ఉపయో గపడుతుందని అర్బన్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావన తీసుకువచ్చారు. అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. మునిసిపల్ కార్పొ రేషన్లకు వన్ టైం సెటిల్ మెంట్ కింద ఆస్థి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మీద రాయితీ ఇవ్వ డానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈనెల 25న రాత్రి ఒక జీఓ విడుదల చేసింది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బల్దియా 90శాతం వడ్డీ మాఫీ రాయితీపై బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యను అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రస్తావించి సమస్య పరిష్కారమయ్యేలా గళం వినిపించ డంపై అర్బన్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అర్బన్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వడ్డీ మాఫీ రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నుకు సంబంధించి 90శాతం వడ్డీ మాఫీపై రాయితీ కల్పిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరం 202 3-24 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ. వడ్డీలో కేవలం 10శాతంతో బకాయిలు చెల్లించేలా బల్దియా అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశం మార్చి 31వరకు మాత్రమేనని సూచించారు. నగర ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరిం చాలని కార్పొరేషన్ కమిషనర్ కోరారు.
