9 hours | స్వర ఝరితో అఖండ నాదార్చన..

9 hours | స్వర ఝరితో అఖండ నాదార్చన..
- సంగీత సేవతో భక్తుల హృదయాలను తాకిన ఆధ్యాత్మిక పరిమళాలు
9 hours | విజయవాడ, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని గవర్నరుపేట శ్రీ సీతారామచంద్రమూర్తి దేవస్థానంలో స్వర ఝరి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అఖండ నాదార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. సంగీత కళాకారులు సమర్పించిన సంగీత సేవ భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక పరిమళాలతో నింపింది.
12 గంటల నిరంతర స్వర ప్రవాహ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన గాయకులు, వాద్యకారులు తమ భక్తి గానాలతో భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేశారు. అఖండ నాదార్చనలో భాగంగా చిరంజీవి విష్ణుభట్ల లక్ష్మీ సంహిత ఆలపించిన సాంబశివ, నాద తనుమనిశం శంకరం, ఎందరో మహానుభావులు, బ్రోచేవారెవరే.. అమూల్య కృతులు ఆలయ ప్రాంగణాన్ని భక్తిరసమయంగా ముంచెత్తాయి. ఆమె స్వరమాధుర్యం, భావప్రకటన, రాగాలాపనలోని నైపుణ్యం భక్తులను ఆధ్యాత్మికానుభూతిలోకి నడిపించాయి. ప్రతి కృతి దైవార్చనగా మారి, అక్కడి వాతావరణాన్ని నాదబ్రహ్మమయంగా తీర్చిదిద్దింది.

