8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిత జోరు ప్రచారం

8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిత జోరు ప్రచారం

ఓటర్ల మద్దతు కోరుతున్న 8వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిత

మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిత జోరుగా ప్రచారం చేపట్టారు. శుక్రవారం రోజు తన మద్దతుదారులతో కలిసి రాఘవేంద్ర కాలనీ, శబరి కాలనీ,బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తాము ఎందుకు పోటీ చేస్తున్నది గెలిచిన తర్వాత ఏ ఏ అభివృద్ధి పనులు చేస్తానో వివరించి ఓట్లు అడిగారు .అధికార పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని అందుకే ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తనను కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఎనిమిదవ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందిస్తామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే ఎందుకూ పనికిరాకుండా పోతుందన్నారు. అభివృద్ధి కోసం ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు

Leave a Reply