జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా భ్రమలే..

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా భ్రమలే..
- కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నది అసత్యం
- 8లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం కుప్పకూలింది
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం
- వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా భ్రమ లేనని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ శనివా రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవ కాశాలు ఇచ్చి, మంత్రి స్థాయి వరకు తీసుకెళ్లిందని గుర్తుచేశారు. అలాం టి పార్టీని వదిలి వెళ్లకుండా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు వంశీ చందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డురి లక్ష్మణ్ తదితరులు సూచించినప్పటికీ ఆయన విన లేదని విమర్శించారు.
ఈ వయస్సులో కూడా పార్టీలు మారడం ఏమి టని ప్రశ్నించారు. కేసీఆర్ మెప్పు కోసం రేవంత్ రెడ్డి వెళ్లాలని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆశ్చర్య కరమన్నారు. ఆయన వ్యాఖ్యలు వింటుంటే మతి భ్రమించిందేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సుమారు 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిం చి పార్టీలో చేర్చుకోవడం, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయిం చడం వంటి చర్యలను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని అభి నందించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీ ఆర్ రాజకీయాలు ఇప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100కి పైగా స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని కొలి పాక సతీష్ ధీమా వ్యక్తం చేశారు.
