రూ.8 కోట్లు ఎగ్గొట్టిన ఇద్దరు రైస్ మిల్ యజమానుల అరెస్టు…

రూ.8 కోట్లు ఎగ్గొట్టిన ఇద్దరు రైస్ మిల్ యజమానుల అరెస్టు…

జన్నారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వానికి అందజేయాల్సిన రూ.8 కోట్ల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకున్నారనే అభియోగం మేరకు ఇద్దరు రైస్ మిల్ యజమానులను మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన రూ.8కోట్ల వడ్ల బియ్యం పక్కదారి పట్టించారనే అభియోగం మేరకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపాన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ్మమాడ్రన్ రైస్ మిల్లు యజమానులైన యాదగిరి లక్ష్మికళ్యాణి, యాదగిరి స్వదేశిరావును అరెస్టు చేసినట్లుగా లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి ఈ రోజు సాయంత్రం తెలిపారు.

గ్రామంలోని లక్ష్మీనరసింహ్మ మాడ్రన్ రైస్ మిల్లుకు సరఫరా అయిన రూ.8 కోట్ల వడ్ల బియ్యాన్ని 2022 – 2024 సంవత్సరాలకుగాను ప్రభుత్వ సివిల్ సప్లైకి సరఫరా చేయలేదు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే కేసు నమోదు చేసి, మంగళవారం సాయంత్రం ఆ ఇద్దరు యజమానులను అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయంశమైంది.

Leave a Reply