మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. ఆశీర్వదించండి

మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. ఆశీర్వదించండి
- 7 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి శైలజ నర్సయ్య గౌడ్
మోత్కూర్, ఆంధ్రప్రభ : మీ ఆడబిడ్డ గా వస్తున్నా… ఆశీర్వదించి గెలిపించండి …అంటూ మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ ఓటర్ల కు విజ్ఞప్తి చేస్తున్నారు. తాను సమాజం పట్ల,ప్రజా సేవ పట్ల అవగాహన కలిగి ఉన్నానని…7 వ వార్డు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని చేతులు జోడించి శైలజ నర్సయ్య గౌడ్ లు ఓటర్ల ను అభ్యర్ధిస్తున్నారు.వార్డు లో ఉన్న ప్రతి సమస్య పై తాము అవగాహన కల్గి వున్నామని, ఆశతో కాదు …ఆశయం కోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేస్తున్నారు.ఆశతో గెలిచిన వాళ్ళు ఆదాయం కోసం చూస్తారు…కానీ ఆశయంతో గెలిచిన వాళ్ళు వార్డు అభివృద్ధి కోసం పని చేస్తారని… 24 గంటలు తాను అందుబాటులో ఉంటూ.. నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మన స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని.. మీ అందరిలో ఒక్కరినైన మాకు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న… మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. ఆశీర్వదించండి…గెలిపించండి అంటూ విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ నెల 11 న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి …అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని…మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్ మహాశయులను కోరుకుంటున్నాను.
