7 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి

7 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి
బీజని బాలమణి భాస్కర్ ప్రచారం
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బీజని బాలమణి భాస్కర్ ఆదివారం కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గురించి తెలుపుతూ ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయిన తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.
