7th Ward | సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నా ..

7th Ward | సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నా ..

7th Ward | కల్లూరు, ఆంధ్రప్రభ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు బిఆర్ఎస్ ఏడవ వార్డు కౌన్సిలర్ బరిలో ఉన్నానని ఆదరించి గెలిపించుకోవాలని 7వ‌ వార్డు కౌన్సిలర్ బానోతు కృష్ణ కోరారు. ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడారు. కల్లూరు మున్సిపాలిటీ గా ఏర్పడిన తొలి దశలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, ప్రజలు ఆదరించి గెలిపించి ఈ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.

నేడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై తమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మరల అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుపై ఓట్లు వేసి ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు.

Leave a Reply