7వ డివిజన్ నుంచి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

7వ డివిజన్ నుంచి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
- 7వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిరామర్తి గోపికృష్ణ
నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, గత పదేళ్లుగా నగర అభివృద్ధికి నోచుకోలేదని తనను కాంగ్రెస్ కార్పొరేటర్ గా 7వ డివిజన్ నుంచి గెలిపిస్తే అభివృద్ధిచేసి చూపిస్తానని రామర్తి గోపి తెలిపారు. 7వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు .ఆ సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామర్తి గోపి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్నానని, విద్యార్థి దశ నుంచి ప్రజాసేవలో ఉన్నానని గుర్తుచేశారు. డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు స్వయంగా తెలుసుకున్నానన్నారు.
చిన్న, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరితో తనకు అనుబందం ఉందన్నారు. తన స్వంత డబ్బులతో డివిజన్ ప్రజలకు ఎప్పటికప్పుడు ఉచిత ఆరోగ్యశిబిరాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. కాలనీలో వీధిలైట్లు పెట్టించానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదన్నారు. రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులతోమంచి సన్నిహిత్యం, అనుబంధం ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. డివిజన్లో సీసీరోడ్లు, సీసీ డ్రైన్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయిస్తానని తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు రామర్తి గోపి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ కి ఓటేద్దాం! అభివృద్ధికి బాట వేద్దాం అని అన్నారు.
