7Steps | భార్యాభర్తల గొడవలకు 7 షాకింగ్ కారణాలు… మానసిక నిపుణుల హెచ్చరిక

7Steps | భార్యాభర్తల గొడవలకు 7 షాకింగ్ కారణాలు… మానసిక నిపుణుల హెచ్చరిక
7Steps | మానసిక నిపుణులు చెప్పిన 7 కారణాలు ఇవే
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకప్పుడు కుటుంబ బంధాలు బలంగా ఉండేవి. భార్యా భర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చినా అవి త్వరగా సర్దుకునేవి. కానీ ఇప్పుడు చాలా మంది దంపతుల మధ్య చిన్న సమస్యలే పెరిగి పెరిగి పెద్ద వివాదాలు, మనస్పర్థలుగా మారి, దాంపత్య కూలుతున్నాయి.
ఈ పరిణామంపై మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, భార్యా భర్తల మధ్య గొడవలు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
1. మాట్లాడుకోకపోవడమే మొదటి సమస్య.
భార్యాభర్తల మధ్య ఓపెన్ మైండ్ తో మాట్లాడుకోకపోతేనే అపార్థాలు పెరుగుతాయి. ఒకరికి ఒకరు తమ భావాలను చెప్పుకోకపోవడం వల్ల ఒకరిపట్ల ఇంకొకరి మనసులో పేరుకుపోయే చిన్న విషయమే పెద్ద అసహనంగా మారుతుంది. ఇద్దారూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
2. ఒకరిపై మరొకరికి అంచనాలు ఎక్కువ… అవగాహన తక్కువ

ప్రతి వ్యక్తికి తమ జీవిత భాగస్వామిపై కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే అవి కేవలం అంచనాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. అనుకున్నంత స్థాయిలో నెరవేరకపోతే నిరాశ, అసంతృప్తి పెరుగుతుంది. వాస్తవిక కోణంలో ఆలోచించి, ఇద్దరూ ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం బలపడుతుంది. లేనిపోని అంచనాలు తగ్గుతాయి.
3. ఈ.ఎం.ఐ.లు, లోన్ లు, ఖర్చులు, ఆదాయం, ఆర్థిక ఒత్తిడి
ఇంటి ఖర్చులు, అప్పులు, ఉద్యోగ ఒత్తిడి వంటి అంశాలు కూడా దంపతుల మధ్య ఉత్కంఠ, ఆందోళన పెంచుతాయి. డబ్బు విషయాల్లో ఇద్దరి మధ్య పారదర్శకత లేకపోతే అపార్థాలు పెరిగి, గొడవలు మరింత తీవ్రమవుతాయి.
4. మొబైల్ ఫోన్లు, అనవసర ఫోన్ కాల్స్ లో ఎక్కువసేపు ఉండడం, సోషల్ మీడియా ప్రభావం
ఇప్పటి కాలంలో చాలా మంది దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం కంటే మొబైల్ ఫోన్, సోషల్ మీడియాకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో పరస్పర సంబంధం దూరమవడం ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అనవసర ఫోన్ కాల్స్ మాట్లాడడం, సోచల్ మీడియాలో చాటింగ్ లు తగ్గించుకోవడం మంచిది. ఇద్దరూ ఒకరి ఫీలింగ్స్ మీద మరొకరు దృష్టి నిలపడం ద్వారా పరస్పరం ప్రాధాన్యత ఇచ్చుకున్నట్టు అవుతుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి.
5. ఏ చిన్న మనస్ఫర్థలు కనిపించినా, కుటుంబ పెద్దల జోక్యం
పెద్దల ఇన్వాల్వ్ మెంట్ లేకపోవడం ఎంత ప్రమాదమో, కొన్ని సందర్భాల్లో అత్తమామలు లేదా ఇతర కుటుంబ సభ్యుల అతిగా జోక్యం చేసుకోవడం కూడా సమస్యలకు దారి తీస్తుంది. భార్యాభర్తలు తమ సమస్యలను ముందుగా తమలో తామే మాట్లాడుకుని పరిష్కరించుకోవడం నూటికి నూరుశాతం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరో కుదిర్చిన ఒప్పందాల ద్వారా కాపురం అస్సలు సాగదు.
6. ఒకరి కోసం ఇంకొకరు సమయం కేటాయించ(లే)కపోవడం
ఉద్యోగాలు, పని బాధ్యతల కారణంగా దంపతులు ఒకరికొకరు సరైన సమయం కేటాయించ(లే)క పోవడం కూడా భార్యాభర్తల మధ్య అంతరాలు పెరగడానికి పెద్ద కారణమే. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, బయటికి వెళ్లడం వంటి చిన్న చిన్న విషయాలే దాంపత్య బంధాన్ని కలకాలం పదిలంగా నిలబెడతాయి.
7Steps | 7. షార్ట్ టెంపర్, కోపం, ఇగో.
కొన్ని సందర్భాల్లో భార్యా భర్తల్లో ఎవరో ఒకరికి ఇగో, కోపం ఉన్నా, చిన్న విషయమే పెద్ద గొడవగా మారుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా సమస్య అక్కడికే ముగిసి పోతుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గకపోతే సమస్య జఠిలంగా మారుతుంది. అంతిమంగా సంసార బంధం విచ్చిన్నమవుతుంది.
7Steps | భార్యాభర్తల బంధం అనేది గెలుపోటముల పోరాటం, పోటీ కాదు.
అది పరస్పర అవగాహన, గౌరవం, ప్రేమతో నడిచే నడిచే బంధం.
చిన్న చిన్న విభేదాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా శాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ద్వారానే కుటుంబంలో సంతోషం నిలుస్తుంది.
CLICK HERE TO READ MORE way2future |మీ డీఎన్ఏ.. ఏ వ్యాధికి మూలం
