6th day | ప్రత్యేక కార్యక్రమాలు..

6th day | ప్రత్యేక కార్యక్రమాలు..
- పుష్ప పల్లకి సేవలో అమ్మవారి ఊరేగింపు..
- పాతాళ గంగలో అమ్మవారి కోసం ప్రత్యేక స్నానాల ఘట్టాలు…
6th day | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 6వ రోజు కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టినట్లు కార్యనిర్వాహణా అధికారి తెలిపారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆరవ రోజు శుక్రవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయన్నారు.
తరువాత యాగశాలయందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయన్నారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయన్నారు. అదే విధముగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించబడుతాయన్నారు.

అమ్మవారికి ఆరో రోజు పుష్పపల్లకీ సేవలో ఊరేగింపు కార్యక్రమం..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ జరిపించబడుతుందన్నారు . ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపించబడతాయన్నారు .తదుపరి పుష్పపల్లకి మేళతాళాలతో శ్రీ స్వామిఅమ్మవార్లను తొడ్కొని వచ్చి వివిధపుష్పాలతో అలంకరించబడిన పుష్పపల్లకిలో ఊరేగింపు చేయడం జరుగుతుందన్నారు.

ఈ విశేషసేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోస్, అశోక పత్రాల మాల, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించడం జరుగుతోందన్నారు. కాగా పురాణాలలో శ్రీశైల మల్లికార్జునస్వామివారు పుష్పప్రియుడని చెప్పబడిందన్నారు . ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, దసరామహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకీ సేవ నిర్వహించడం జరుగుతోందన్నారు.

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పై భక్తుల ప్రశంసలు…
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రం కు కాలిబాటతో పాటు బస్సులో వచ్చిన ప్రయాణికులకు భక్తులకు కల్పించిన వసతులపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ మధ్యప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వచ్చిన భక్తులు ఇక్కడే వసతులను చూసి ఆనందం వ్యక్తం చేయడం విశేషం. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి శివరాత్రికి శ్రీశైలం కు వస్తున్నామన్నారు.

కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా క్యూలైన్లో తాగునీరు రవాణా మరియు అన్నదాన ఏర్పాటు చిన్న పిల్లలకు పాలు వంటి అత్యంత సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు రాము నరసింహ తెలుపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజులో 69 వెల మంది భక్తుల దర్శనం..
… మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో సందర్భంగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు వేలాదిమందిగా తరలివచ్చి దర్శనం చేసుకోవడం విశేషం. ఇప్పటివరకు 79 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నరు. నడక మార్గంలో 32,95 మంది భక్తులు దర్శనం చేసుకోగా శివ స్వాములు స్పర్శ దర్శనం 23,825 మంది దర్శనం చేసుకున్నారు.
అన్నదాన కార్యక్రమానికి 28482 మంది అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. వారికి ప్రత్యేక నీడనిచ్చే చలవ పందిర్లు వేశారు. మొత్తానికి భక్తులు ఆనందం వ్యక్తం చేయడం విశేషం. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మాకు సంతోషం కలిగిస్తుందని భక్తుల పేర్కొనటం హర్షదాయకం.
click here to read more : 13thFeb2026 | నేటి పంచాంగం & రాశి ఫలితాలు, కుంభ సంక్రాంతి ప్రత్యేకం
