69 RGs | ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలు…

69 RGs | ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలు…
- అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్
69 RGs | జనగామ, ఆంధ్రప్రభ : జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రజావాణి(public voice)లో పలు సమస్యలపై అందచేసిన ఆర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లు మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే స్వీకరించిన దరఖాస్తుల(petitions) పై ఎండార్స్మెంట్ చేసి, సంబంధిత అధికారులకు అందజేశారు.
స్వీకరించిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించాలని, గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి, అవరమైతే క్షేత్రస్ధాయిలో పర్యటించి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు, పెండింగ్ లో ఉన్న అర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించి, సంబంధిత వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆయన తెలిపారు.
ప్రజావాణిలో 69 ఆర్జీలు(69 RGs) స్వీకరించారు. జనగామ నివాసి ఎం, స్వప్న తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని నాకు ఎలాంటి ఆధారం లేదని ఉండడానికి నివాసం కూడా లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని ఆమె కోరారు. అంబేద్కర్ నగర్ నివాసి బి పుష్ప తన భర్త 25 సంవత్సరాల క్రితం మరణించారని నాకు ఇద్దరు కుమారులు ఉన్నారని సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని , ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని దరఖాస్తు సమర్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
