63 pastors | పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక..

63 pastors | పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక..

63 pastors | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నియోజకవర్గ కేంద్రంలోని సీయోను ప్రార్థన మందిరం (హెబ్రోను) లో ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్(Pastors Fellowship) అసోసియేషన్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో నియోజకవర్గ పాస్టర్లతో పాటు క్రైస్తవ పెద్దలు హాజరై కొత్త కమిటీని ఎన్నుకున్నారు.

మొత్తం 63 మంది పాస్టర్ల(63 pastors) సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రెవరెండ్ ఆశీర్వాదం, అధ్యక్షులుగా పి. జాన్ పాల్, జనరల్ సెక్రటరీగా యస్. పి. ఫెర్రి రాయ్, కోశాధికారిగా యం. ఆనంద్, ఉపాధ్యక్షులుగా పి. క్రిస్టఫర్, జాయింట్ సెక్రటరీగా యం. అబ్రహం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బయన్న, రాజరత్నం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పాస్టర్లు అభినందనలు తెలియజేస్తూ, క్రైస్తవ సంఘాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పాస్టర్లు మరియు నాయకులు, అంతటి మల్లేష్, మీసాల సుధాకర్, బొంత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply