ఐదో వార్డును ఆదర్శంగా చేస్తా

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్నె గంగామణి ( కర్నెగంగయ్య )
భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ )అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదో వార్డు ను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారంతో ఆదర్శంగా తీర్చి దిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్నె గంగామణి ( కర్నె గంగయ్య ) అన్నారు. గురువారం ఐదో వార్డు లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ అభ్యర్థి కి ఓటు వేయడం ద్వారా వార్డు అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధి కొరకు కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధి కొరకు ఇప్పటికే రూ 55 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. తాను గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి చెందినప్పటికి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశానని, ఈ సారి అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా చేతి గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. స్థానికుడిగా, మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. చేతి గుర్తుకు ఓటు వేసి విజయం అందించాలన్నారు. ఆయన వెంట యువకులు, మహిళలు పాల్గొన్నారు.
