ఆయన పాలనలోనే పేదలకు అద్భుతమైన అభివృద్ధి

ఆయన పాలనలోనే పేదలకు అద్భుతమైన అభివృద్ధి

  • అధినేతను కలిసిన 5వ వార్డు కౌన్సిలర్ రమ్య రఘు రెడ్డి

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలి చిన మహానేతను స్టేషన్ ఘన్‌పూర్ 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య రఘు రెడ్డి తమ బృందంతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ప్రాణాలను పణం గా పెట్టి పోరాడిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర హక్కుల సాధన, రైతు సంక్షేమం, నీటి వనరుల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్ అందించిన పరిపాలన ప్రజలకు మేలు చేసిందని, ముఖ్యంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధం గా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని అభిప్రాయపడ్డారు. అనంతరం కేసీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా చందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఐత ఉపేం దర్, గండసిరి ఉపేందర్, మనీష్ తోట, పిట్టల ప్రశాంత్, పసునూరి సందీప్ కుమార్ ,రాకేష్, సంజయ్ జంగిటి, గుగులోత్ భాను తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply