53rd birthday | జగన్ పుట్టినరోజు వేడుకలు

53rd birthday | జగన్ పుట్టినరోజు వేడుకలు

  • గుడివాడ వైసీపీ కార్యాలయంలో కేక్ క‌టింగ్‌

53rd birthday | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో వాడవాడలా మాజీ సీఎం జగన్‌ 53వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ (Cake) కట్ చేసిన నాయకులు ఒకరికొకరు తినిపించుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గమంతా జగన్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరగడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ (Ys Jagan) నైజం అని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారన్నారు. ప్రజా సంక్షేమ ప్రదాత జగన్ సీఎం కాకుండా చేసినందుకు, ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. ఎన్నికలు వస్తే జగన్ ను సీఎం చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వైసిపి నాయకులు పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్ర‌వేశ పెట్టిన ఘ‌న‌త జగన్‌కు ద‌క్కుతుంద‌న్నారు. కక్షపూరిత ధోరణితో పాలన చేస్తున్న కూటమి పాలనపై ప్రజలంతా విరక్తి చెందార‌న్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొర్రెల శీను, నాయకులు పాలేరు చంటి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కందుల నాగరాజు, పెయ్యల ఆదాము, అడబాల అప్పారావు, గుళ్ళపూడి చంద్రశేఖర్, కోటప్రోలు నాగు, గుదే రవి, లోయ రాజేష్, షేక్ సయ్యద్ , ఎస్కే బాజీ ,జ్యోతుల సత్యవేణి, రమిజా, మరియు గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మండలాల నాయకులు అభిమానులు (Fans) కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply