విద్యార్థులు సైంటిస్టులు గా ఎదగాలి..

విద్యార్థులు సైంటిస్టులు గా ఎదగాలి..

సైంటిస్టులు గా ఎదిగితే ఒక లక్ష రూపాయలు అందజేస్తా..
లింగాపూర్ జడ్పీ హైస్కూల్ సైన్స్ టీచర్ వాల్గోట్ కిషన్ వెల్లడి..

కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా లోని కడెం మండలం జెడ్ పి ఎస్ ఎస్ లింగాపూర్ పాఠశాలలో శనివారం పాఠశాల ఆవరణలో “జాతీయ సైన్స్ దినోత్సవం “ ను ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నిరంతరం పరిశోధనలు చేసి, సమాజానికి మరియు ప్రజలకు ఉపయోగపడే వాటిని కనుగొనడం వలన ప్రజలు సుఖవంతమైన జీవితాలను గడుపుతున్నారని పాఠశాల ఇంచార్జి హెచ్ఎం కాలేరి భూమేశ్వర్ విద్యార్థులకు అవగాహన కలిగించారు.

జెడ్ పి ఎస్ ఎస్ లింగాపూర్ లో 2025-2026 విద్యా సంవత్సరం లో 6 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న 524 విద్యార్థుల నుండి భవిష్యత్ లో ఏ విద్యార్థి ఐన శాస్త్రవేత్త గా ఎంపిక అయితే జెడ్ పి ఎస్ ఎస్ లింగాపూర్ పాఠశాలలో పని చేస్తున్న సైన్స్ టీచర్ వాల్గోట్ కిషన్ ఒక లక్ష రూపాయలు నగదు పారితోషికం అందజేస్తానని తెలిపారు. సైన్స్ పరికరాలు,టెలిస్కోప్ మొదలగు వాటిని ప్రదర్శించి అవి ఎలా పనిచేస్తాయో టీచర్లు విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి ఎస్ ఎస్ లింగాపూర్ ఇంచార్జ్ హెచ్ఎం కాలేరి భూమేశ్వర్ ,సైన్స్ టీచర్లు బాలాజీ, శ్రీదేవి,విశ్వనాథ్ రెడ్డి, మహేష్ మరియు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply