బిజెపి అంటే అభివృద్ధి భద్రత..సేవే లక్ష్యంగా గెలుపే ధ్యేయంగా మీ బిడ్డగా ఓటేసి ఆశీర్వదించండి

బిజెపి 51వ వార్డు అభ్యర్థి నల్లపు రజిత రమేష్
మంచిర్యాల ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి భద్రత అని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 51 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి నల్లపు రజిత రమేష్ అన్నారు. సేవే లక్ష్యంగా గెలిపే ధ్యేయంగా మీ బిడ్డగా ఓటేసి ఆశీర్వదించండి అని లక్ష్మీ నగర్ వికాస్ నగర్ కాలనీలలో తన కుటుంబ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి బుధవారం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.గత కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు మంచిర్యాల పట్టణ అభివృద్ధిని మరిచాలని ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి అధికారాన్ని అనుభవించారే కానీ అభివృద్ధి చేసింది శూన్యం అని విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాధ రావు,జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ లు కంకణం కట్టుకున్నారని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 60 డివిజన్లోని బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 51 డివిజన్లో అపరిస్కృతముగా ఉన్నటువంటి పనులను చేయించేందుకు నిత్యము మీ కుటుంబ బిడ్డగా ఉంటూ ముందుకు సాగుతానని పిలుపునిచ్చారు.డివిజన్ ఇంచార్జ్ ప్రభాకర్,నాయకులు రమేష్,అశోక్,సురేందర్,వెంకటేష్ మహిళ నాయకురాళ్లు కళావతి, లావణ్య,అనుష,తదితరులు పాల్గొన్నారు.
