మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ…

మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ…
భవానిపురం, ఆంధ్రప్రభ : నగరాల సామాజికవర్గంలో అందరికీ గుర్తుండి పోయే వ్యక్తి పోతిన చిన్నా అని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50 ఏళ్ల వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘం ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ తేలప్రోలు రాజీ స్కూల్ ఎదురుపగా ఏర్పాటు చేసిన కాంశ్య విగ్రహాన్ని ఎమ్మల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడిగా, కార్మిక నాయకునిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
సాధారణంగా కార్మిక నాయకులు పారిశ్రామిక వేత్తలకు వ్యతిరేకంగా ఉంటారు కానీ చిన్నా గారు వ్యాపారస్తులకు, పారిశ్రామిక వేత్తలకు ప్రతి విషయంలోను సహకరిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి క్రిషి చేసిన మహానాయకుడని కొనియాడారు. సమాజంలోని ప్రతికులంవారు రాజకీయాల్లోకి ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి ననుంచి పశ్చిమ నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేసినా తనకు ఇంకా పూర్తిగా సంతృప్తి లేదని సుజనా పేర్కొన్నారు. పోతిన చిన్నా గారి చరిత్ర తెలుసుకుని నేటి తరం నాయకులంతా రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

నగరాల సామాజిక వర్గం అంతా ఎన్నికలలో నన్ను ఆదరించడం వల్లే అంత ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయాలు నడువాలి అనే సిద్దాంతంతో నేను కూడా అందరికీ సేవలు అందించే శాసనసభ్యునిగా గుర్తింపు తెచ్చుకుంటానన్నారు. ఒక కార్మిక నాయకుడిగా మరియు పశ్చిమ నియోజకవర్గ వ్యాపార,పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని.యువ నాయకులు అందరూ కూడా పోతిన చిన్న గారిని ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలి అని కోరారు.

ఎన్నికలలో గెలిచే వరకే రాజకీయాలని, ఎన్నికల తరువాత అందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివ్రుద్దికి కృషి చెయ్యాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగరాల సంఘం అద్యక్షుడు బాయన బాబ్జీ, నగర మేయన రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, బుల్లా విజయ్ కుమార్, జనసేన జిల్లా అద్యక్షుడు సామినేని ఉదయభాను, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, అబ్దుల్ ఖాదర్, అడ్డూరి శ్రీరామ్ .తదితరులు పాల్గొన్నారు.
