ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడు..

ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడు..

రోకలి బండతో కొట్టి చంపిన వైనం…
నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మానవత్వాలు మంట కలిసి పోతున్నాయి. ప్రేమ ఆప్యాయత అనుబంధం అనురాగాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తి కోసం తోడబుట్టిన అన్నను చంపిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో దైవ భక్తుడు 38 వ్యక్తిపై సొంత తమ్ముడు విజయరాజ్ లోకల్ కొట్టి చంపిన వైనం ఆదివారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆర్ కృష్ణాపురం గ్రామానికి చెందిన యోసేపుకు 5 మంది కుమారులు ఉన్నారు. అన్నదమ్ముల మధ్య పొలం పంచాయతీ గొడవలు ఉన్నాయి. ఆదివారం అన్న దైవభక్తుడు తమ్ముడు విజయరాజు మధ్య తీవ్రవాగ్యవాదం జరిగింది. అన్న పై రోకలి బండతో దాడి చేశా డు. అడ్డువచ్చిన ఇరువురి అన్నల పై కూడ దాడి చేయగా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

చికిత్స నిమిత్తం వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దైవ భక్తుడు మరణించాడు. ఈరోజు అన్నదమ్ముల పరిస్థితి విషమంగా ఉంది. భార్య సుజాత కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.

Leave a Reply