కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న జిన్ని వనిత వెంకటేష్

కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న జిన్ని వనిత వెంకటేష్

2&3) కాలనీలో సీసీ రోడ్లు వేయించిన దృశ్యం
ప్రజల మధ్యే ఉంటాం ప్రజల కోసమే పని చేస్తాం
మళ్ళీ ఆదరించండి మరింతగా అభివృద్ధి చేస్తాం
4 వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి జిన్ని వనిత వెంకటేష్

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : ప్రజల మధ్యే ఉంటాం, ప్రజల కోసమే పని చేస్తాం, ప్రజల ఆశీర్వాదాలతో మళ్ళీ గెలిచి 4 వ వార్డ్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని ఆ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి జిన్ని వనిత వెంకటేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం స్థానిక కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రచారం నిర్వహించారు.కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గత ఐదేళ్ళల్లో కాలనీల్లో సీసీ రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ గా కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, పెన్షన్స్ అర్హులైన అందరికీ ఇప్పించినట్లు వివరించారు.

రాబోయే రోజుల్లో బోయవాడ స్కూల్ ఏరియాలో సీసీ రోడ్డు,డ్రైనేజీ కాలువలు నిర్మించి, భీమన్న ఇంటి నుంచి కాలనీలో ప్రతి ఏరియాలో సీసీ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తానని, చెత్త చెదారం లేకుండా కాలనీని ఆదర్శంగా నిలుపడంలో అందుబాటులో ఉండి పని చేస్తానని జిన్ని వనిత వెంకటేష్ ఓటర్లకు హామీ యిచ్చారు.మాజీ సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు తులం బంగారం, పెన్షన్స్ పెంపు, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజా సేవ చేసే వారికి పట్టం కట్టాలని ప్రతి ఓటర్ ఆలోచించి అందుబాటులో ఉండేవారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రజా సేవకునిగా 4 వ వార్డ్ సమగ్ర అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని, కార్ గుర్తుకు 11 న జరిగే పోలింగ్ లో అందరూ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కార్యాకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply