4sides | పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ

4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ

4sides |జీ స్టూడియోస్ – ప్రేరణ అరోరా నిర్మాణంలో ప్రతిష్టాత్మక చిత్రం
మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా గ్రాండ్ విజువల్ ప్లాన్
సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం.. ప్రీ-ప్రొడక్షన్ శరవేగం
హీరోయిన్ ఎంపికపై సస్పెన్స్.. త్వరలో అధికారిక ప్రకటన
భక్తి, భావోద్వేగాలు, హై వోల్టేజ్ యాక్షన్‌తో ప్రేక్షకులకు ట్రీట్

4sides | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ యంగ్ హీరో తెలుగు సినిమాలో ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఫ్యామిలీ హీరోగా చాలామంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. త‌న న‌ట‌న‌తో యూత్‌లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ‘క’ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ హీరో కే ర్యాంప్ తో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే అబ్బ‌వ‌రం పెద్ద ప్లానే వేశాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడీ టాలెంటెడ్ హీరో.

4sides
4sides

జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ తో కలిసి ప్రఖ్యాత నిర్మాత ప్రేరణ అరోరా నిర్మాతగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఒక భారీ పాన్-ఇండియా చిత్రంను నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్‌ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply