48 hours | మంత్రికి ఎన్నికల నిబంధనలు వర్తించవా…?

48 hours | మంత్రికి ఎన్నికల నిబంధనలు వర్తించవా…?

48 hours | మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చట్టానికి అతీతుడా..? ఎన్నికల నిబంధనలు మంత్రికి వర్తించవా..? ఎన్నికల తేదీకి 48 గంటల ముందే ప్రచారం ముగించాలనే నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ.. మంత్రిగారు మాత్రం ఏకంగా సెక్యూరిటీని వేసుకొని చెట్టాపట్టాలేసుకుని కాలనీల్లో తిరుగుతుండడం గమనించదగ్గ విషయం.

తన నలుపు రంగు ప్రత్యేక వాహనంలో సెక్యూరిటీ వెహికిల్ వెంటేసుకొని అభ్యర్థులను కలుస్తూ అనధికార ప్రచారం నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పోలీసులు సైతం చిరునవ్వులు నవ్వుతూ మరోక వాహనాన్ని తీసుకుని అత్యుత్సాహంగా మంత్రి వెంటగా తిరుగుతుండడం ఈ సందర్భంగా గమనించదగ్గ విషయం. అయితే మంత్రిగారికి మున్సిపల్ ఎన్నికల ఓటమి భయం పట్టుకొని ఇలా వార్డుల పొంటి మున్సిపాలిటీల్లో చక్కెర్లు కొడుతున్నారని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

Leave a Reply