44 days | గూడెం హుండీ లెక్కింపు….

44 days | గూడెం హుండీ లెక్కింపు….
44 days | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో 44 రోజుల(44 days)కు సంబంధించిన హుండీని గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖా నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవి కిషన్ ఆధ్వర్యంలో హుండీని విప్పి లెక్కించగా 44 రోజులకు గాను, రూ. 7,13,335(Rs. 7,13,335)వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటలా శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోవర్ధన రఘు స్వామి, వేద పండితులు నారాయణ శర్మ, అర్చకులు, ఆలయ సిబ్బంది, శ్రీ సత్యనారాయణ స్వామి సేవ సమితి సభ్యులు, అన్నమాచార్య సేవ సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
