క్రమశిక్షణ ఎంతో ముఖ్యం..

ఆలేరు, ఆంధ్రప్రభ : విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యమని, దానిని ఆయుధంగా మలచుకొని విద్యార్థులు ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె. సత్యనారాయణ అన్నారు. ఆలేరు పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 42వ వార్షికోత్సవం, శ్రీ రామకృష్ణ పరమహంస 190 జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేలా, దేశం అభివృద్ధి చెందేలా తమ జీవితాలను మలచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోతారని చెప్పారు. ధన సంపాదన కోసమే జీవితాన్ని గడుపుతూ పిల్లలను పట్టించుకోవడంలేదని, అందువల్ల పిల్లలు పక్కదారులు పట్టే ప్రమాదముందని హెచ్చరించారు. పాఠశాల కరస్పాండెంట్ బండిరాజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బీజన బాలమణి, భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వైస్ ప్రిన్సిపాల్ తరిగొప్పుల రమేశ్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేశ్, బొడ్డు రమేశ్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, అప్పాల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యెనగందుల కవిత, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని, వేముల భవాని, ఎం.మౌనిక, కొండ స్వాతి, సిరికొండ పద్మలత, యెలగందుల మమత, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
