42వ ఐసీఎఓ సభలో భారత ప్రతినిధిగా హాజరు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : కెనడా మాంట్రియాల్ లో జరుగుతున్న 42వ ఐసీఎఓ ( సాధారణ సభలో భారత ప్రతినిధిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భారత కాలమానం ప్రకారం గురువారం పాల్గొన్నారు. ఐసీఎఓ కౌన్సిల్ అధ్యక్షుడు సాల్వటోర్ షియాక్చిటానో, కార్యదర్శి జనరల్ జువాన్ కార్లోస్ సలాజార్ లతో అయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సభలో భారత విమానయాన రంగం సాధిస్తున్న విశేషమైన వృద్ధిని రామ్మోహన్నాయుడు వివరించారు. భారత విమానయాన వృద్ధికి సహకారం అందిస్తున్న ఐసిఎఓకి అయన కృతజ్ఞతలు తెలిపారు. ఐసిఎఓ కౌన్సిల్‌లో గ్లోబల్ ఏవియేషన్ లో భారత విప్లవం పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చించారు.