ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 403అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 403అర్జీలు

అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలి
అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాలు


తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) (PGRS) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ (Venkateswar) సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ.. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఎ ఓపెనింగ్ లేకుండా అర్జిదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీతో పాటు డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కల్లెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివ శంకర్ నాయక్, రోజ్ మాండ్, సుధా రాణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ -262, వ్యవసాయ శాఖ -2, పాఠశాల విద్యా శాఖ -4, సూపరింటెండెంట్ రుయా- 2, గ్రామ వార్డు సచివాలయ శాఖ -3, పంచాయతీ రాజ్- 39, ఫ్యామిలీ వెల్ఫేర్ -2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -12, పశు సంవర్థక శాఖ -1, ఎంప్లాయిమెంట్- 1, సివిల్స్ సప్లైస్- 12, స్కిల్ డెవలప్మెంట్ -1, పోలీస్ -12, జల వనరులు- 6, దేవాదాయ శాఖ -1, సెర్ప్- 12 , సర్వే- 7, ఆర్టీసీ- 1, రుయా -1, విద్యుత్- 4, జాతీయ రహదారులు -2, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్- 2, సెకండరీ హెల్త్ -1, ఎస్సీ కార్పొరేషన్- 1, సమగ్ర శిక్ష – 2, హౌసింగ్ -1, గనులు భూగర్భ జలాలు -2, మైనారిటీ వెల్ఫేర్- 2, రూరల్ డెవలప్మెంట్- 1, రిజిస్ట్రేషన్ శాఖ -1, పరిశ్రమల శాఖ – 1, మత్స్య శాఖ -1, ఉద్యాన శాఖ -1 వెరసి మొత్తం 403 వినతులు అందాయి.

Leave a Reply