40 feet | శివరాత్రి వేళ అభివృద్ధి సందడి

40 feet | శివరాత్రి వేళ అభివృద్ధి సందడి
40 feet | మునుగోడు, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి శుభసందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి శివాలయం వరకు జరిగిన రోడ్డు అభివృద్ధి పనులను సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథలతో కలిసి వెదిరె బ్రదర్స్ వెదిరె మేఘా రెడ్డి, వెదిరె విజేందర్ రెడ్డి (ఉపసర్పంచ్)లు పరిశీలించారు.
ఈ మార్గంలో సుమారు ఒక కిలోమీటర్ మేర ఇరువైపులా మొరం పోసి దాదాపు 40 అడుగుల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేశారు. రోడ్డు విస్తరణతో శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తుల రాకపోకలు సౌకర్యవంతంగా మారనున్నాయి. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల మెరుగుదల దిశగా వెదిరె బ్రదర్స్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసించారు.అభివృద్ధి పనులతో గ్రామానికి నూతన శోభ సంతరించుకుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
