అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం

  • 30 ఏండ్ల ప్రజా సేవను గుర్తించండి
  • ఆదరించండి అభివృద్ధి చేస్తా
  • 4 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి మోత్కూరి రాజేశ్వరి -వెంకటస్వామి గౌడ్

లక్షేట్టిపేట, ఫిబ్రవరి 6(ఆంధ్ర ప్రభ ) 4 వ వార్డ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదేనని ఆ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ దంపతులు ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 4 వ వార్డ్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో వార్డ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా సేవ చేస్తానన్నారు.

వార్డ్ లో డ్రైనేజీ,వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే ప్రభుత్వం పలు రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉందని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, 200 యూనిట్స్ కరెంటు, పెన్షన్స్ ఇస్తూ అందరికీ అండగా ఉందన్నారు.

30 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్నామని,ఎమ్మెల్యే సహకారంతో వార్డ్ ను సమగ్ర అభివృద్ధి చేసి ఇతర వార్డ్ లకు ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. ఈ నెల 11 న చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రజాసేవకు మరింతగా అవకాశం ఇచ్చి ఆదరించాలని వెంకటస్వామి దంపతులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు నయీమ్,కిషన్ గౌడ్,సత్యం, మహిళలు, ముస్లీమ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply