అభివృద్ధి నా లక్ష్యం

ఖమ్మం రూరల్ , ఆంధ్రప్రభ : ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 32 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటి సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి వెంపటి సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ.. వార్డు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని.. వార్డు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి అన్నారు. ఏదులాపురం అభివృద్ధికి పాటుపడ్డానని నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.వార్డులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు..

Leave a Reply