అసలు ఏం జరిగింది..?

అసలు ఏం జరిగింది..?

ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : గత రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. వర్షపు దాటికి అడవిలో మేతకు వెళ్లిన నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామం బోళ్ల కుమారస్వామికి సంబంధించిన గొర్రెల మందలోని 25 నుంచి 30 గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సూరిపెల్లి గ్రామానికి సమీపంలో ఉన్న రాంపూర్ అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు, ఇంకా గొర్రెరలు మృతి చెందే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. గొర్రెల్లు మృతి కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని వారు కోరారు.

Leave a Reply