ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రేమ్ సాగర్ అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు

రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పుట్ట యశోద

మంచిర్యాల ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) ఒక్క అవకాశం ఇవ్వండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుట్ట యశోద తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గం లో దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాలలో మన ప్రియతమ నాయకుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్న ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని రెండవ డివిజన్ లోని ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం వర్తించే విధంగా కృషి చేస్తానని. కాలనీలలో రోడ్లు మురుగు కాలువలు వీధి దీపాలు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులకు ఇండస్ట్రియల్ హబ్ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సహకరిస్తానని తెలిపారు.

ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు నిర్మించుకున్నటువంటి ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరు చేయించి పట్టాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న హామీ ఇచ్చినారని ఈ ప్రాంత అభివృద్ధికి నా జీవితం అంకితం చేసేందుకు సమాజoలో ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం పోరాడుతానని పిలుపునిచ్చారు.గత ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించడం ద్వార వెనుకబడిన ఈ ప్రాంతాన్ని గత ప్రభుత్వాలకు భిన్నంగా.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పనులను చేయించేందుకు బాధ్యత వహిస్తానని. ఒకసారి అవకాశం ఇవ్వండి రెండవ డివిజన్లోని ప్రజలందరూ హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో పుట్టా యశోద మీ బిడ్డను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply