మీ బిడ్డగా ఆదరించండి వార్డు అభివృద్ధి నా బాధ్యత

మీ బిడ్డగా ఆదరించండి వార్డు అభివృద్ధి నా బాధ్యత

  • 2వ వార్డు కాంగ్రెస్ నాగరాజు మిస్కిన్
  • రైటప్: 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు మిస్కిన్

మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మీ బిడ్డగా మీ ముందుకు వచ్చా ఆదరించండి ఆశీర్వదించండి కౌన్సిలర్ గా గెలిపించండి ఈ ప్రాంత అభివృద్ధి తన అభిభతంగా పనిచేస్తానని 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజు మిస్కిన్ అన్నారు.గురువారం తన మద్దతు దారులతో కలిసి ఆయన వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .

ఈ సందర్భంగా నాగరాజు మిస్కిన్ మాట్లాడుతూ మీ బిడ్డను మీ ఇంటి పక్కనే ఉంటా ఏ వేళలో ఏ సమస్య వచ్చినా మీ ముందుకు వస్తా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మన ప్రాంత అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 2వ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి మక్తల్ లోనే ఆదర్శ వార్డుగా 2వ వార్డును తీర్చిదిద్దుతానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ 2వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నాగరాజు మిస్కిన్ పేర్కొన్నారు.

Leave a Reply