వందలాది ఓటర్లతో బుర్ర కొమురయ్య ప్రచారం

వందలాది ఓటర్లతో బుర్ర కొమురయ్య ప్రచారం
- ప్రచారంలో దూసుకుపోతున్న 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీలోని 2 వ వార్డులో ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బుర్ర కొమురయ్య గౌడ్ దూసుకుపోతున్నారు. శుక్రవారం వార్డు పరిధిలో వందలాదిమంది ఓటర్లు, పార్టీ కార్యకర్తలు , మద్దతు దారులతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చేయి గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో 2 వ వార్డులో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని, ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి కొమురయ్య విజ్ఞప్తి చేస్తున్నారు.
