వార్డు ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటా….

వార్డు ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటా….
మంథని, ఆంధ్రప్రభ : వార్డు ప్రజల కోసం ఎల్లప్పుడూ మంథని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ నూకల కమల్ పేర్కొన్నారు. బుధవారం మంథని మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో ఆయన స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్య పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు. వార్డు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు సహకారంతో వార్డును అభివృద్ధి చేయడంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన వివరించారు. వచ్చేది వేసవికాలం వార్డు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో గెలిపించేందుకు వారి రుణం తీర్చుకునేలా పనిచేస్తానని ఆయన తెలిపారు.
