2kAbove| బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్ ఒక్కరోజులో.. మళ్లీ..

2kAbove| బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్ ఒక్కరోజులో.. మళ్లీ..
2kAbove| పెళ్లిళ్ల సీజన్‌తో పెరిగిన బంగారం డిమాండ్
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.2,290 పెంపు
22 క్యారెట్ల బంగారం ధర రూ.2,100 అధికం
తగ్గుముఖం పట్టిన పసిడి మళ్లీ పరుగులు
వినియోగదారులకు ఒక్కసారిగా షాక్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి… తిరిగి పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. ఇవాళ (గురువారం) ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు షాక్ గురయ్యారు. హైదరాబాద్‌లో బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,200గా ఉండగా, గురువారం అది రూ.1,56,490కు చేరుకుంది. అంటే ఒక్కరోజులోనే రూ.2,290 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. నిన్న రూ.1,41,350గా ఉన్న ఈ రేటు, ఈరోజు రూ.1,43,450కు పెరిగింది. అంటే రూ.2,100 ఎక్కువైంది.

