28thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

28thFebCartoon| ఆంధ్రప్రభ ‘ఔరా’లో తమిళనాడు రాజకీయాల చమక్కు

28thFebCartoon| తమిళనాడులో వేడెక్కిన రాజకీయం-మారుతున్న సమీకరణలు
డీఎంకే, ఐడీఎంకే వ్యూహాలు – గెలుపే లక్ష్యం
పన్నీర్ సెల్వం రాజకీయ అడుగు వెనుక ఆసక్తికర కోణం
జయలలిత విధేయత నుంచి డీఎంకే తీర్థం వరకు
రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న ‘ఔరా’ కార్టూన్ ఫీచర్

28thFebCartoon
28thFebCartoon

పావులు కదుపుతున్న పార్టీలు

ఎవరి లెక్కలు వారివే.

మారుతున్న సమీకరణలు

ఎవరికి వారే గెలుపుపై ధీమా.

తమిళనాడులో సరికొత్త సమీకరణలకు తెరలేచింది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గెలుపు వ్యూహాల్లో తల మునకలై పోయాయి పార్టీలన్నీ. అధికార డీఎంకే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతుండగా, ఓపీఎస్ ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది.

ఇక ఐడీఎంకే బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత విధేయుడు పన్నీర్ సెల్వం డీఎం కే తీర్థం పుచ్చుకున్నారు. మిగతా పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలన్నీ ఒక ఎత్తయితే, పన్నీరు సెల్వం డీఎంకే లో చేరడంలో ఒక ఆసక్తికరమైన అంశం దాగుంది. అదేమిటంటే, జయలలితకు వీరవిధేయుడై ఉండీ ఆ పార్టీతో పడని పార్టీ తీర్థం పుచ్చుకోవడం.

ఈ విషయాన్ని చమత్కారంగా చూపించిన కార్టూన్ ఇది. భవిష్యత్తు కోసం అమ్మకు పడని అధికార పార్టీలో చేరడం అనివార్యమైనా, అమ్మ మీద ఉన్న విధేయత ఎక్కడికీ పోదుగా. అనే కోణంలో చమక్కు అందించిన కార్టూన్. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

-ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

Leave a Reply