రాష్ట్రస్థాయిలో విద్యార్థులు రాణించడం గర్వకారణం..

రాష్ట్రస్థాయిలో విద్యార్థులు రాణించడం గర్వకారణం..
విద్యార్థులకు, పీడీలకు కలెక్టర్ సన్మానం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాఉట్నూర్ వికాసం పాఠశాల విద్యార్థులు ఈనెల 17న హైదరాబాదులో సమగ్ర సర్వ శిక్ష ఆధ్వర్యంలో జిసిపి ఈ సికింద్రాబాద్ లోనిబిపిడి కాలేజ్ మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల సిడబ్ల్యూఎస్ఎన్ క్రీడల్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ వికాసం పాఠశాల విద్యార్థులు వివిధ రంగాల్లో 25 మంది రాష్ట్రస్థాయి బహుమతులు పొందారు దీంతో విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీడీలకు ఆదిలాబాద్ కార్యాలయం పిలిపించుకొని శాలువలతో మెమెంటోళ్ళతో ప్రశంస పత్రాలతో సన్మానం చేసి ప్రశంసించారు.
వికాసం పాఠశాల దివ్యాంగుల విద్యార్థులకు కృషితో రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ రావడం ఎంతో గర్వకారణం అని కలెక్టర్ అన్నారు. వికాసం పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో బహుమతులు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా స్పోర్ట్స్ అధికారి పార్థసారధి , వికాసం ప్రిన్సిపాల్ రాథోడ్ వికాస్, అర్చరి కోచ్ రాథోడ్ అశోక్, పిడి కొట్నాక్ జలపత్ రావు, వికాసంపాఠశాలఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులు పాల్గొన్నారు.
