24 hours | 20 ఏళ్ల కరెంట్‌ సమస్యకు ముగింపు

24 hours | 20 ఏళ్ల కరెంట్‌ సమస్యకు ముగింపు

24 hours | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని మదీన మస్జిద్‌ ఆవరణలో గత 20 సంవత్సరాలు(20 years)గా పాడై ఉన్న కరెంట్‌ ట్రాన్స్ఫార్మర్‌(Transformer) స్థానికులకి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని కాలనీ వాసులు పేర్కొన్నారు. పాత ట్రాన్స్ఫారం పనిచేయకపోవడంతో తాత్కాలిక లైన్‌ ద్వారా అందుతున్న విద్యుత్‌ సరఫరా ఎప్పటికప్పుడు నిలిచిపోవడం, వోల్టేజ్‌ సమస్యలు వంటి అవాంతరాలతో ఆ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాన్ని ఇటీవల కాలనీ వాసులు స్వయంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ(MLA Dr. Vamsikrishna) దృష్టికి తీసుకురాగ, సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులను సంప్రదించి అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా కేవలం 24 గంటల్లోనే విద్యుత్తు శాఖ ఏడిఈ ఆంజనేయులు(ADE Anjaneya) నేతృత్వంలో నూతన ట్రాన్స్ఫార్మర్‌ ఏర్పాటు పూర్తిచేయబడిరది.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ అమరినందున మదీన మస్జిద్‌ పరిసర ప్రాంతాల్లో దీర్ఘకాలంగా వున్న కరెంట్‌ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా ఈ సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ స్పందించలేదని, కానీ మేము సమస్యను మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణకు తెలియజేయగానే కేవలం 24 గంటల్లోనే ట్రాన్స్ఫార్మర్‌(Transformer within 24 hours) ఏర్పాటు చేయించి మా సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మేల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ చైర్మన్‌ రఫీ, మున్సిపాలిటీ కోఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌, ఎమ్మెల్యే పి.ఏ సోహెబ్‌, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply