22 Indian Ships Stranded : ఆయిల్ కష్టాల్లో భారత్ Andhra Prabha News

22 Indian Ships Stranded : ఆయిల్ కష్టాల్లో భారత్ Andhra Prabha News
గల్ఫ్ యుద్ధం తీవ్రత..
- భారత్‌కు చమురు, గ్యాస్ సంక్షోభం
- ధరల మోత.. ద్రవ్యోల్భణం దూకుడు
- ఆర్థిక వ్యవస్థపై పెను భారం
- భారత్ అలర్ట్ మోడ్‌లోకి
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ)
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అమెరికా రగల్చిన పగ, ప్రతీకారేచ్ఛ పశ్చిమ ఆసియాను అగ్నిగుండంగా మార్చివేయగా… వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్గు .. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జగడంలో.. భారత్ అతాకుతలం అవుతోంది. అశేష ప్రజానీకానికి అవసరమైన నిత్యవసర సరకుల రవణాకు అత్యవసరం, అనివార్య చమురు కుంపటిలో.. భారత్ అల్లాడిపోతోంది. ఈ అష్టకష్టాల నుంచి తప్పించుకోవటంపై అహర్నిశం తపిస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ విరచిత ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీ ప్రారంభమై 20 రోజులు నిండాయి. ఈ లోపు ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ ప్రతి దాడితో మిడిల్ ఈస్ట్ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. ప్రధానంగా చమురు, గ్యాస్ కష్టాలతో సతమతం అవుతోంది. దీనికి తోడు గల్ఫ్ రాజ్యంలో చిక్కుకున్న 90 లక్షల మంది భారతీయుల్ని సొంతింటికి చేర్చటంపై దృష్టి సారించింది. రవాణకు అత్యవసర ఇంధనం కొరతతో ఆర్థిక సమస్యలు భారత దేశాన్ని భయపెడుతున్నాయి. భారతదేశం తన అవసరాలలకు 80% చమురు పైగా, అవసరాలలో 50% పైగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది.
22 Indian Ships Stranded : ధరాఘాతం
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెండ్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $115 – $118 దాటడంతో, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్యాస్ కొరత: భారత్ తన ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతుల్లో అధిక భాగం ఖతార్ (QatarEnergy) నుండే పొందుతుంది. రాస్ లఫాన్ కేంద్రంపై ఇరాన్ దాడి చేయడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రూపాయి విలువ: చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది, దీనివల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయే (Depreciation) ప్రమాదం ఉంది. ఇది ద్రవ్యోల్బణానికి (Inflation) దారితీస్తుంది.
22 Indian Ships Stranded : ఆ 40 దేశాలే దిక్కు
ప్రస్తుతం భారత్ 40 పైగా దేశాల నుంచి చమురును సేకరిస్తోంది. భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 31.5% నుండి 32.3% వరకు ఉంది. ఇక ఇరాక్ రెండో అతిపెద్ద సరఫరాదారుగా సుమారు 20% నుండి 21% వాటాను కలిగి ఉంది. జనవరి 2026 నాటికి సౌదీ అరేబియా వాటా 17.5% కి పెరిగింది. అమెరికా నుంచి కూడా దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి, ప్రస్తుతం అమెరికా సుమారు 9% వాటాతో ముఖ్య సరఫరాదారుగా ఉంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్థిర సరఫరాను అందిస్తోంది.
కువైట్ (6.1%), నైజీరియా, అంగోలా, బ్రెజిల్ , లిబియా తదితర దేశాల నుంచి కూడా భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది.
22 Indian Ships Stranded : గల్ఫ్ దేశాలే ఆధారం
భారతదేశం తన గ్యాస్ అవసరాల కోసం ప్రధానంగా గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉంది . ఖతార్ నుంచి భారత్ అత్యంత కీలక గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతుల్లో ఖతార్ వాటా సుమారు 41.4% నుంచి 47% వరకు ఉంది. సుమారు 13.47% వాటాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE):రెండో స్థానంలో ఉంది. ఇక అమెరికా 10.51% వాటా తో మూడో స్థానంలో ఉంది ఒమన్, నైజీరియా మరియు అంగోలా నుండి కూడా భారత్ గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది.
22 Indian Ships Stranded : వంట గ్యాస్ మంట
భారత్ తన ఎల్‌పీజీ (LPG) వినియోగంలో 60% దిగుమతి చేసుకుంటుంది.
ఇందులో 90% దిగుమతులు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతాయి, ఇది ప్రస్తుతం యుద్ధం కారణంగా ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతినకుండా ఉండేందుకు, భారత ప్రభుత్వం రష్యా, అమెరికా నుంచి దిగుమతులు పెంచడం ద్వారా తన ఇంధన వనరులను వైవిధ్యపరుస్తోంది
22 Indian Ships Stranded : అధినేత అప్రమత్తం
యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వం అత్యంత చురుగ్గా వ్యవహరిస్తోంది . ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు గల్ఫ్ దేశాల నేతలతో నిరంతరం మాట్లాడుతున్నారు. “ఇది యుద్ధాల యుగం కాదు” అని చెబుతూనే, ప్రాంతీయ సుస్థిరత కోసం చర్చలు జరపాలని కోరుతున్నారు. ఇక విధేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, గల్ఫ్ దేశాల ప్రతినిధులతో అత్యవసర చర్చలు జరిపారు. భారత వాణిజ్య నౌకల రక్షణే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ నౌకల రక్షణ కోసం భారత నావికాదళం (Indian Navy) యుద్ధనౌకలను పహారాకు పంపింది. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి సామాన్యులను కాపాడటానికి, భారత్ తన భూగర్భ చమురు నిల్వలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గ్యాస్. ఆయిల్ కోసం రష్యా ఇతర ఆఫ్రికా దేశాల నుండి దిగుమతులను పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
22 Indian Ships Stranded : చమురు కష్టాలు
యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్నందున, దిగుమతులపై ఆధారపడే భారత్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు $115 దాటడంతో, భారత్‌లో లీటరు పెట్రోల్ ధర ₹5 నుండి ₹10 వరకు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. భారత్ తన అవసరాలకు అవసరమైన గ్యాస్‌లో ఎక్కువ భాగం ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అక్కడ ఉత్పత్తి దెబ్బతినడంతో, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగవచ్చు లేదా సరఫరాలో జాప్యం జరగవచ్చు. రవాణా ఖర్చులు (Transport costs) పెరగడం వల్ల పండ్లు, కూరగాయలు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ గగనతలం మూసివేయడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు ముఖ్యంగా యూరప్, అమెరికా వెళ్లే వారికి భారీగా పెరిగాయి.
22 Indian Ships Stranded : నావికాదళం అలెర్ట్
పౌరుల రక్షణ కోసం నావికాదళం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది:
పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో భారతీయ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడానికి INS కోల్‌కతా, INS చెన్నై వంటి శక్తివంతమైన యుద్ధనౌకలను మోహరించింది. 2019 నుండి కొనసాగుతున్న ఆపరేషన్ సంకల్ప్ (Operation Sankalp) ఇప్పుడు మరింత ఉధృతం చేశారు. భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా నావికాదళం నిరంతరం పర్యవేక్షిస్తోంది , గగనతల పర్యవేక్షణ: నిఘా కోసం P-8I విమానాలను డ్రోన్లను ఉపయోగిస్తూ సముద్ర మార్గాల్లో అనుమానాస్పద కదలికలను గమనిస్తున్నారు.
22 Indian Ships Stranded : 22 నౌకలు స్థంభన
పశ్చిమ ఆసియాలోఉద్రిక్తతల కారణంగా పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతాల్లో 22 భారతీయ నౌకలు నిలిచిపోయాయి.నావికులు: ఈ 22 నౌకల్లో మొత్తం 611 మంది భారతీయ నావికులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. గత వారం మొదట్లో ఓడల సంఖ్య 28గా ఉండేది, కొన్ని నౌకలు సురక్షితంగా బయటకు చేరుకున్నాయి. . 22 నౌకల్లో ఎక్కువ శాతం భారతదేశ ఇంధన భద్రతకు సంబంధించినవే ఉన్నాయి వీటిలో 4 ముడి చమురు నౌకలు, 6 LPG నౌకలు, 1 LNG నౌక.3 కంటైనర్ నౌకలు (Container Ships). 2 బల్క్ క్యారియర్లు (Bulk Carriers). 1 కెమికల్ ప్రొడక్ట్స్ నౌక. మిగిలినవి డ్రెడ్జర్లు లేదా మరమ్మత్తుల్లో (Dry dock) ఉన్న నౌకలు ఉన్నాయి. ఈ నౌకల్లో భారతదేశానికి అత్యంత కీలకమైన ఇంధన నిల్వలు ఉన్నాయి . సుమారు 16.7 లక్షల టన్నుల ముడి చమురు, సుమారు 3.2 లక్షల టన్నుల LPG వంట గ్యాస్. 2 లక్షల టన్నుల LNG ఉన్నాయి.చిక్కుకున్న ఈ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత నావికాదళం (Indian Navy) యుద్ధనౌకల ద్వారా కాపలా కల్పించే ప్రణాళికను సిద్ధం చేసింది.
