21-time padayatra | శబరిమలకు అయ్యప్పల పాదయాత్ర

21-time padayatra | శబరిమలకు అయ్యప్పల పాదయాత్ర
- రాజు గురుస్వామి ఆధ్వర్యంలో 22వ పాదయాత్ర
21-time padayatra | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం(Sri Sri Sri Ayyappa Swamy Temple) నుండి మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు పాదయాత్రగా తరలి వెళ్లారు. రాజు గురు స్వామి ఆధ్వర్యంలో 22వ సారి మక్తల్ పట్టణం నుండి పాదయాత్రగా అయ్యప్ప స్వాములు బయలుదేరారు. ముందుగా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అశోక్ గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు(special pujas) నిర్వహించారు.
అనంతరం ఇరుముడులు కట్టి బుధవారం సాయంత్రం పాదయాత్ర స్వాములను ఘనంగా సాగనంపారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ గురు స్వామి, తాళంపల్లి అనిల్ గురుస్వామి మాట్లాడుతూ కూరగాయల రాజు గురుస్వామి అయ్యప్ప పాదయాత్రకు మొదట ఒక్కడిగా ప్రారంభించి నేడు 22వ ఏట మొత్తం 30 మంది అయ్యప్ప స్వాములతో పాదయాత్ర చేపట్టడం అయ్యప్ప పట్ల రాజు గురు స్వామికి ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం అన్నారు. 21 సార్లు పాదయాత్ర(21-time padayatra)లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు .

ఈసారి పాదయాత్రలోనూ ఎలాంటి ఇబ్బందులకు గురికుండా అయ్యప్ప స్వాముల పాదయాత్ర విజయవంతం కావాలని అశోక్ గౌడ్ గురు స్వామి ఆకాంక్షించారు. అఖిల భారతీయ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మక్తల్ శాఖ ఆధ్వర్యంలో శబరిమల యాత్రలో భాగంగా పాదయాత్ర స్వాములను సాగనంపారు. ఈ కార్యక్రమంలో పలువురు గురు స్వాములు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
