20th ward | వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఇందుమతి ఖరారు

20th ward | వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఇందుమతి ఖరారు
20th ward | ఉత్కంఠకు తెరపడిన కాంగ్రెస్ చైర్‌పర్సన్ ఎంపిక
రాజకీయ వ్యూహంలో భాగంగా ఇందుమతి ఎంపిక
రసవత్తరంగా మారనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలు
20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
వైరా జనవరి 30 (ఆంధ్రప్రభ ) వైరా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ ఎంపిక తర్జనభర్జనకు తెరపడింది.. వైరా ప్రజానీకం ఎవరా..? అంటూ ఎదురుచూస్తున్న ఆ ఉత్కంఠకు కూడా తెరపడినట్లే… కాంగ్రెస్ పార్టీ వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థిగా తొలినాటి నుండి వినిపిస్తున్న పేరే ముమ్మాటికి ఖరార్ అయిందని చెప్పవచ్చు… కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడుగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్నేహితుడైన ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, వైరా మాజీ సర్పంచ్ వైరాకు చెందిన పువాళ్ళ దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతికి ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి…

అంతేకాకుండా మున్సిపాలిటీలో విలీన గ్రామమైన సోమవారం 11వ వార్డు నుంచి పోటీ చేసేందుకు సర్వత్రా సిద్ధమైనట్లు తెలుస్తోంది..ఆస్ట్రేలియాలోని దుర్గాప్రసాద్ ఇందుమతి దంపతుల తనయుడు వద్దకు వెళ్లిన వారు.. అక్కడ ఉండేందుకు సమయం ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా నుంచి హుటాహుటిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఇందుమతి దంపతులు వైరా చేరుకోవటం తో.. రాజకీయ వ్యూహంలో భాగమే అని కచ్చితంగా ఆమె పోటీ చేస్తుందని వార్తలు కూడా వినిపించాయి… గత రెండు మూడు రోజులుగా వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ బొర్రా రాజశేఖర్ కట్ల రంగారావు తోపాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు జరిపిన చర్చల్లో.. ఎట్టకేలకు అభ్యర్థి ఎంపికను ఖరారు చేశారు.. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమావేశపరచి కాంగ్రెసులో ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే విషయంలో కార్యకర్తలు అందరితో ప్రతిజ్ఞ కూడా చేయించారు…
కాంగ్రెస్ ఎంపిక కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు… ఎట్టకేలకు చైర్ పర్సన్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది.. మరో ముఖ్య ఘట్టం 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కూడా.. అది కూడా పూర్తి చేసే విషయంలో కసరత్తు జరుగుతుంది..
click here to read 20th Ward | మౌనం వీడిన ‘బొర్రా’ కుటుంబం.. వైరా మున్సిపల్ ఎన్నికలో ఉమాదేవి ఎంట్రీ!
