2026 Stars | ఒకటి కాదు.. రెండు అంటున్న స్టార్స్..

2026 Stars | ఒకటి కాదు.. రెండు అంటున్న స్టార్స్..
Star Heroes | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : స్టార్ హీరోలు ఒకప్పుడు ఒకటి కాదు.. రెండు, మూడు సినిమాలు రిలీజ్(Three movies released) చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే.. వేరే లెవల్. ఆయన ఒకే సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. రాను రాను స్టార్ హీరోలు ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేయడం(Doing more movies) అనేది తగ్గిపోయింది. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తే గొప్ప అనేట్టుగా తయారైంది పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ ఇయర్ లో స్టార్స్ ఒకటి కాదు.. రెండు అంటూ రెండు సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ.. డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న స్టార్స్ ఎవరు..?
2026 Stars | మన శంకర వరప్రసాద్, విశ్వంభర..

మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 12న మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ప్రేక్షకుల ముందుకు(In front of the audience) వస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ భారీ, క్రేజీ మూవీలో విక్టరీ వెంకటేష్ ముఖ్యపాత్ర పోషించడం విశేషం. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు(Huge expectations) ఉన్నాయి. ఇక చిరు నుంచి వస్తున్న మరో సినిమా విశ్వంభర. దీనికి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉండే సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతోన్న మూవీ ఇది. ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ.. కొన్ని కారణాల వలన లేట్ అయ్యింది. ఇప్పుడు సమ్మర్ లో విశ్వంభర రానుంది. త్వరలోనే రిలీజ్ ఎప్పుడు అనేది డేట్ అనౌన్స్(Date announcement) చేయనున్నారు. ఇలా చిరు ఈ ఇయర్ లో మన శంకర్ వరప్రసాద్ గారు, విశ్వంభర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
2026 Stars | వెంకీ అంతకు మించి..

ఇక వెంకీ విషయానికి వస్తే(When it comes to Venky).. మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నారు. ఇందులో వెంకీ గెస్ట్ రోల్ కాదు.. దాదాపు ఇరవై నిమిషాలకు పైగా ఉంటారని.. ఆడియన్స్ కి వినోదాల విందు లాంటి సినిమా అని టాక్ బలంగా వినిపిస్తుంది. వెంకీ సోలో హీరోగా నటిస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం. ఇటీవల ఈ సినిమాని సెట్స్ పైకి(The movie sets up) తీసుకువచ్చారు. వెంకీ హీరోగా త్రివిక్రమ్ కథ -మాటలు అందించగా తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వెంకీ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా రూపొందుతుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్(Release in summer) చేయనున్నారు. వెంకీ రెండు సినిమాలే కాదు.. దృశ్యం 3 కూడా ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేసి రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని టాక్. ఇదే కనుక జరిగితే.. వెంకీ నుంచి మూడు సినిమాలు వస్తాయి.
2026 Stars | రాజాసాబ్, ఫౌజీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన అభిమానుల కోసం సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్(Two movies released) చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. జనవరి 9న రాజాసాబ్ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఫౌజీ(The movie Fauji). హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రాన్ని సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కానీ.. అక్టోబర్ లో థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. రాజాసాబ్ రిలీజ్ తర్వాత ఫౌజీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం ప్రభాస్(Year Prabhas) నుంచి రెండు సినిమాలు రావడం ఖాయం.
2026 Stars | నాని కూడా..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్యారడైజ్ అనే సినిమా(The movie Paradise) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. నానిని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్న ప్యారడైజ్ మూవీని మార్చి 27న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాని.. ఓజీ డైరెక్టర్ సుజిత్(Director Sujith) తో సినిమా చేయనున్నారు. ఎప్పుడో ఈ సినిమా చేయాలి కానీ.. ఓజీ వలన లేట్ అయ్యింది. ఈ సినిమాను ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేసి.. ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలనేది ప్లాన్. ప్యారడైజ్ మూవీ రిలీజ్ తర్వాత ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ (Start shooting)చేయనున్నారు. ఇలా చిరు, వెంకీ, ప్రభాస్, నాని.. రెండు సినిమాలతో ఈ సంవత్సరం డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. మరి.. ఈ స్టార్స్ రెండు సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
