2026 Sankranthi | సెంటిమెంట్ కలిసొచ్చేనా…?

2026 Sankranthi | సెంటిమెంట్ కలిసొచ్చేనా…?

2026 Sankranthi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల బొమ్మ మీనాక్షి చౌదరి. అందం, అభినయంతో ఆకట్టుకుంది.. తొలి సినిమా (Movie) ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా.. వరుసగా ఆఫర్స్ అందుకుంది. అలాగే విజయాలు కూడా సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతుంది. ఇప్పుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ అమ్మడుకు ఓ సెంటిమెంట్ ఉంది. మరి.. మీనాక్షి సెంటిమెంట్ ఏంటి…? ఈసారి కూడా సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా..?

2026 Sankranthi

2026 Sankranthi | మీనాక్షి వేరే లెవల్..

ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా తర్వాత మీనాక్షి అడవి శేష్ హిట్ 2 సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ అమ్మడు దశ తిరిగింది. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో (Maheshbabu) గుంటూరు కారం, యంగ్ హీరో దుల్కర్ తో లక్కీ భాస్కర్, విక్టరీ వెంకటేష్‌ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించింది. ఆడియన్స్ ని మెప్పించి సక్సెస్ సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లింది. దీంతో ఇప్పుడు మీనాక్షి ఫుల్ బిజీ అయ్యింది.

2026 Sankranthi

2026 Sankranthi | మీనాక్షి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..

2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించింది. ఇందులో మీనాక్షి చౌదరి (meenakshi chowdary) నటించిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఇయర్ 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

2026 Sankranthi

2026 Sankranthi | అనగనగా ఒక రాణి..

ఇప్పుడు 2026లో సంక్రాంతికి మీనాక్షి అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికు జంటగా నటించింది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ (Producer) నాగవంశీ నిర్మించారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా అందర్నీ అలరించడం ఖాయమని నిర్మాత నాగవంశీ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే.. మీనాక్షి నటించిన సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో సంక్రాంతికి మీనాక్షి నటించిన సినిమా వస్తే.. బొమ్మ బ్లాక్ బస్టరే అనేది సెంటిమెంట్ గా మారింది. మరి.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న అనగనగా ఒక రాజు కూడా సెంటిమెంట్ వర్కవుట్ అయి బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.

2026 Sankranthi

CLICK HERE TO READ చిరు, వెంకీ కలిసి స్టెప్పేస్తే..

CLICK HERE TO READ MORE

Leave a Reply