2026 Josh | పోలీసుల ఆంక్షలివిగో..!
మరికొన్ని గంటల్లోనే 2025 వెళ్ళిపోతోంది…2026 వచ్చేస్తోంది….
2026 Josh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకల్లో (New Year celebrations) ఫుల్ల్ గా ఎంజాయ్ చేయడానికి అందరూ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు… మందుప్రియులైతే తమకిష్టమైన బ్రాండ్ల రుచులు తల్చుకుంటూ ఎప్పుడెప్పుడాని ఉవ్విళ్ళూరుతున్నారు. ఎంజాయ్ చేయడానికి ఎక్కడైతే బాగుంటుందని స్పాట్ లు వెతుక్కుంటున్నారు. బాగానే ఉంది కానీ, పార్టీ ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ మెంటు అయ్యాక ఇళ్ళకు తిరిగెళ్ళడానికి మాత్రం పోలీసులు చేసే హెచ్చరికలను (Police warnings) కూడా దృష్టిలో ఉంచుకోవాలండోయ్. లేకపోతే చాలా ఇబ్బందైపోతుంది మరి. ఎందుకంటే ఈ విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. తేడా వస్తే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కటకటాల్లో మేల్కొనాల్సి ఉంటుంది…మనలాంటోళ్ళు మరికొంత మంది అక్కడ ఉంటే జైల్లోనే న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవాల్సి ఉంటుంది….అయ్య బాబోయ్ …వద్దంటారా? అయితే పోలీసుల వారి ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదవండి మరి.
1) మద్యం (alcohol) తాగి బైక్ గానీ, కారు డ్రైవర్ చేయొద్దు.. మీ ప్రాణాలనే కాక, రోడ్డు మీద వేళ్ళే వారి ప్రాణాలనూ ఫణంగా పెట్టొద్దు.
2) పబ్ (Pub) లో డ్రింక్ చేయొచ్చు, ఫుడ్డు ఎంజాయ్ చేసుకోవచ్చు…డ్యాన్స్ లు ఇరగ దీసుకోవచ్చు…కానీ, అన్నిటికంటే ప్రమాదకరమైన, చట్టవిరుద్దమైన డ్రగ్స్ వినియోగిస్తే మాత్రం చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. పబ్ లోకొచ్చి ఎవరు చూస్తారులే అని ఉదాసీనత వద్దు. పోలీసుల నజర్ దాటి వెళ్ళడం కష్టమే.
3) కాస్తో కూస్తో తాగిన వారూ, లేదా పీకల దాకా పెగ్గులకొద్దీ ఎక్కిన వారూ, ఆ కిక్కులో రోడ్ల మీద అత్యుత్సాహంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. ఎందుకంటే, మద్యం మత్తులో అలాంటి చర్యలు చేసే వారికి మజాగా ఉండొచ్చు కానీ, చూసేవారికి మాత్రం, జుగుప్సాకరంగా, అసహ్యంగా అనిపిస్తుంది. ఇలాంటి చర్యలను అస్సలు సహించబోమంటున్నారు పోలీసులు (Police).
4) సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) లేకుండా, అనుమతి లేకుండా బైకులూ, కార్లూ అసలు డ్రైవింగ్ చేయకూడదు. బైక్ నడుపుతూ దొరికితే మైనర్లయితే వదిలే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు… ఇక మెయిన్ రోడ్లపై రెచ్చిపోయి బైక్ రైడింగ్ లు చేస్తే మాత్రం అంతే సంగతులు. అడుగడుగునా ఉన్న సీసీ కెమెరాల్లో మీ విన్యాసాలు పోలీసులు క్షణాల్లో చూడడం జరిగిపోతుంది. ఆ తర్వాత చర్యలు మామూలే.
5) పరిసరాలన్నీ దద్దరిల్లిపోయేలా డీజేలపై (DJs) నిషేధం విధించారు పోలీసులు. ఎందుకంటే, చిన్న పిల్లలు, వృద్ధులు, గుండెజబ్బుల వాళ్ళు ఎందరో ఉండొచ్చు. వారికి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. మీ సరదా, వేరొకరికి ప్రాణసంకటం కాకూడదంటున్నారు పోలీసులు. డీజే పెట్టుకోవచ్చు కానీ, దానికీ ఒక పరిమితి ఉంటుంది. అది కాస్త శృతి మించితే మాత్రం చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
6) ఇక ఊరి చివర విసిరేసినట్టుగా ఉండే ఫామ్ హౌస్‌ల్లో అనుమతి లేకుండా పార్టీలు చేయకూడదు. ఎందుకంటే న్యూ ఇయర్ పార్టీల పేరున డ్రగ్స్, గంజాయి (Drugs, marijuana) లాంటి వాటి వినియోగం గతంలో సంచలనం సృష్టించింది. అందుకని ఫాం హౌజుల మీద కూడా పోలీసుల ప్రత్యేక దృష్టి ఉంటుందని వేరే చెప్పాలా?
కనుక, ఇవన్నీ తెలిసినవే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనం తేలికగా తీసుకున్నా, పోలీసులు మాత్రం తేలికగా తీసుకునేట్టు లేరు. ఎంజాయ్ (enjoy) చేయండి…లిమిట్స్ చూసుకోండి. ఆల్ ద బెస్ట్ విష్ యూ హ్యాప్పీ న్యూ ఇయర్ 2026.

