2022 | అప్పుడు పంపించారు..మళ్ళీ పిలిపించారు..అదే ఐఏఎస్ అధికారికి మళ్లీ కీలక పదవి

2022 | త్యాగరాజ్ స్టేడియం వివాదం:
2022 | సంజీవ్ ఖిర్వార్ పేరు ఎలా వైరల్ అయింది?
లద్దాఖ్ బదిలీ నుంచి ఢిల్లీకి రీఎంట్రీ: కేంద్రం తాజా నిర్ణయం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఉన్న సవాళ్లు
2022 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆయనో అధికారి…ఆయన పేరు సంజీవ్ ఖిర్వార్. అట్లాంటిట్లాంటి అధికారి కాదండోయ్…1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన భార్యామణి రింకూ దుగ్గా కూడా విశ్రాంత ఐఏఎస్ అధికారి. వారు ప్రతిరోజూ మార్నింగ్ వాక్ కి వెళ్ళేవారు. వెళ్తే అందులో వింతేముంది? అందరూ వెళ్తారు, వారూ వెళ్తారు అనుకోవద్దు. అక్కడే ఉంది అసలు కథ. “రాజు వెడలె రవి తేజములలర” అన్నట్టు వారితోబాటు వారి కుక్కను కూడా తీసుకెళ్ళేవారు…ఇందులో కూడా కొత్తేం లేదంటారా? ఆగండాగండి…అక్కడే ఉంది అసలు ట్విస్టు.
వారి కుక్కగారి కోసం వాకింగ్ కి వెళ్ళే స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించేవారు… ఐఏఎస్ అధికారుల పెంపుడు కుక్కలన్నాక ఆమాత్రం డాబూ దర్పం ఉండొద్దా ఏమిటి అని అనుకున్నారో ఏమో కానీ, కుక్కగారి కోసం దిల్లీలోని త్యాగరాజ్ స్టేడియాన్నే వాడేసుకున్నారు. ఇది కొంతకాలం బాగానే నడిచినా, జనం ఊరుకోరు కదా, అధికార దుర్వినియోగమంటూ ఫిర్యాదులు చేయడంతో అప్పట్లో ఈ వార్త బాగా వైరలయింది. ఇంకేముంది? ఆయన్ని విధుల్లోంచి తప్పించింది కేంద్రప్రభుత్వం. ఇప్పుడు అదే ఐయేఎస్ అధికారిని వెనక్కి పిలిపించింది కేంద్రప్రభుత్వం.. అప్పుడు సంజీవ్ ను లద్దాఖ్ కు బదిలీ చేసిన ప్రభుత్వం..

తాజాగా ఆయన్ను వెనక్కి రప్పించింది. అదే వివాదాస్పద ఐఏఎస్ అధికారికి కీలక పదవి దక్కింది. ఆయన్ను దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీ చేయించిన అధికారిగా కొన్నేళ్ల క్రితం వార్తల్లో నిలిచిన సంగతి జనమింకా మర్చిపోలేదు. అప్పుడు సంజీవ్ ను లద్దాఖ్ కు బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆయన్ను వెనక్కి రప్పించింది. ఎంసీడీ పాలనాపరంగా, ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. త్వరలో బడ్జెట్ ను ప్రవేశపెట్లనుంది. ఈ నేపథ్యంలో సంజీవ్ నియామకం జరిగింది.
click here to read Gold vs Stock Market |షేర్ మార్కెట్ – బంగారం ధరల మధ్య సంబంధం
