పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

అల్ మేవా ను అభినందించిన జిల్లా కలెక్టర్
పేదలను ఆదుకోవాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సంఘం ద్వారా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఆల్ మైనారిటీ వెల్ఫేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణి కలెక్టర్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పండుగను సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ఉన్న సుమారు 200 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ప్రతి లబ్ధిదారునికి రూ.600 విలువైన నిత్యావసర సరుకులు (బియ్యం, కిరాణా) మరియు పాలు, స్వీట్లు వంటి పండుగ ఖర్చుల కోసం రూ.400 నగదును కలిపి మొత్తం రూ.1000 విలువైన తోఫాను అందచేయడం జరిగిందన్నారు. పేదలను ఆదుకోవడం పుణ్య కార్యక్రమమని ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహ పర్వీన్, జిల్లా ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ ముక్తియార్ బాషా, జనరల్ సెక్రెటరీ రియాజ్ బాషా, వైస్ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్, ఫైనాన్స్ సెక్రటరీ షఫీ అహ్మద్, ఉమెన్ సెక్రెటరీ సహారా భాను, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జమిల్ ఉద్దీన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సఫియుల్లా బైగ్, అబ్దుల్ కాలిక్, ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply