20 years | ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

20 years | ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
20 years | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా ఇవాళ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలోని గ్లోరీ పెంత్తు కోస్తుల్ చర్చ్ మెదక్ జిల్లా పాస్టర్ అసోసియేషన్(Pastor’s Association) ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుక సంబరాలు జరుపుకున్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రైస్తవ బంధువుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల(20 years) నుండి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలోని వితంతులకు వస్త్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే జిల్లాలోని చర్చిలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 30వేల రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(MLA Mynampally Rohit Rao)కు నియోజకవర్గ ప్రజలపై ప్రభువు దీవెన ఉండాలన్నారు.

అనంతరం నూతన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకులమహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్(Field Assistant) బిక్షపతి, వార్డు సభ్యులు బొమ్మెన స్వామి, సంఘ పాస్టర్లు సామెల్, మోజేష్, సంఘ కమిటీ సభ్యులు నవీన్, స్వామి, చంద్రం, సైదయ్య, వడ్డే నవీన్, బెస్తఅనిత, సాకలి ఎంకమ్మ, క్రైస్తవ బంధువులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
