Software | సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ఉద్యోగం…

Software | సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ఉద్యోగం…

Software | జైనూర్, ఆంధ్రప్రభ : ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉంటే సాధ్యం కానిది ఏమి లేదని నిరూపించుకున్నాడు గ్రామీణ యువకుడు మనోజ్ కుమార్. పట్టుదలతో బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ(Software company)లో ఉద్యోగాన్ని సాధించి నిరూపించుకున్నారు.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని శివునూర్ మారుమూల గ్రామానికి చెందిన లంబాడ గిరిజన యువకుడు రాథోడ్ మనోజ్ కుమార్, ఆ గ్రామానికి చెందిన వైద్యశాఖ ఉద్యోగి రాథోడ్ ఉత్తమ్ కుమారుడు పట్టుదలతో ముందుకు వెళ్లి బెంగళూరులోని రజర్పే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని 20 లక్షల ప్యాకేజీ(20 lakh package)తో సాధించుకున్నట్లు మనోజ్ కుమార్ తండ్రి రాథోడ్ ఉత్తమ్ తెలిపారు. మారుమూల గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ కు బెంగళూరు కంపెనీలో ఉద్యోగం రావడం పట్ల ఆయన బంధువులు మిత్రులు అభినందించారు.

మారుమూల గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరు కంపెనీలో ఉద్యోగం సాధించడం ఆ గ్రామంలో ఒకే ఒక్కడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించడం గర్వనీయమని ఆయన మిత్రులు పేర్కొన్నారు.

Leave a Reply